తెలంగాణలో నలుగురు ఓమిక్రాన్ బాధితుల ఆరోగ్యం విషమం

first-death-from-omicron-variant-in-america

తెలంగాణ రాష్ట్రంలో నలుగురు ఓమిక్రాన్ బాధితుల ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. దేశ వ్యాప్తంగా
ఓమిక్రాన్ కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతుండడం తో అన్ని ప్రభుత్వాలు మరింతగా దృష్టి సారించింది. ఒమిక్రాన్‌ అనుకున్నదానికన్నా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే దేశంలో 170కి పైగా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓమిక్రాన్ గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే 21 వరకు కేసులు నమోదయ్యాయి. వీరంతా విదేశాల నుంచి వచ్చిన వారే. జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో వీరందరికి ఓమిక్రాన్ సోకిందని తెలిసింది. అయితే తాజాగా తెలంగాణలో నలుగురు ఓమిక్రాన్ బాధితుల ఆరోగ్యం సీరియస్ గా ఉందని తెలుస్తుంది. అయితే వీరంతా ఆఫ్రికా దేశాలకు చెందిన విదేశీయులే. మిగతా వారి పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తోంది. ఆఫ్రికా దేశాలకు చెందిన వారు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వస్తుంటారు. ఇలా కెన్యా, సోమాలియా నుంచి నలుగురు క్యాన్సర్ పేషెంట్లు తెలంగాణకు వచ్చారు. వీరిలో ఓమిక్రాన్ బయటపడగా… వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్యాన్సర్ వ్యాధి ఉండటంతో పాటు ఓమిక్రాన్ సోకడంతో ఆరోగ్యంపై ప్రభావం పడిందని.. వైద్యులు చెబుతున్నారు.

మరోపక్క ఓమిక్రాన్ వల్ల అమెరికాలో తొలి మరణం సంభవించింది. టెక్సాస్ రాష్ట్రంలో ఈ మరణం చోటు చేసుకుంది. దీన్ని అక్కడి వైద్యాధికారులు కూడా ధ్రువీకరించారు. ప్రపంచంలో యూకేలో ఇప్పటి వరకు 12 మంది ఓమిక్రాన్ మరణాలు సంభవించాయి. తాజాగా అమెరికాలో మరో మరణంతో మరణాల సంఖ్య 13కు చేరింది. ఓమిక్రాన్ వల్ల తొలి మరణం కూడా యూకేలోనే నమోదైంది. అయితే మొదటగా ఓమిక్రాన్ వల్ల స్వల్ప లక్షణాలే ఉంటాయని అనుకుంటున్నప్పటికీ.. మరణాలు లేవని అనుకుంటున్నప్పటీకీ.. తాజాగా మరణాలు సంభవిస్తుండటం అందర్నీ కలవరపరుస్తోంది.