పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి పాదాభివందనం

వనపర్తి: మంత్రి నిరంజన్ రెడ్డి గాంధీ జయంతి సంధర్భంగా పెబ్బేరు మున్సిపాలిటీ ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి, వారికి పాదాభివందనం చేశారు. పారిశుద్ధ్య కార్మికులతో పాటు పోలీసులు, మీడియా మితృలను కూడా మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అహింసా మార్గంలో స్వాతంత్ర్యం సాధించారని గాంధీజీ సేవలను కొనియాడారు. సహాయ నిరాకరణ ఉద్యమంతో దేశ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చారని తెలిపారు. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసి గ్రామాలను బలోపేతం చేస్తుందన్నారు. కరోనా వైరస్ నిర్మూలనలో పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల సేవల వెలకట్టలేనివి అని కొనియాడారు. మీడియా మిత్రులు కూడా ఎంతో సహకారం అందించారని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/