ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోని రెవెన్యూ సమస్యలపై మంత్రి‌ చర్చ

TS Minister Ktr
TS Minister Ktr

హైదరాబాద్‌: రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కెటిఆర్‌ జీహెచ్ఎంసీ ప‌రిధిలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయ‌ర్‌, ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని మున్సిప‌ల్ ఛైర్మ‌న్లు, కార్పొరేట‌ర్ల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోని రెవెన్యూ సంబంధిత స‌మ‌స్య‌ల‌పై కెటిఆర్ చ‌ర్చిస్తున్నారు. దీర్ఘ‌కాలిక పెండింగ్‌లో ఉన్న ఇళ్ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ, ఇత‌ర అంశాల‌పై చ‌ర్చించి దిశానిర్దేశం చేస్తున్నారు. వ్యవసాయేతర ఆస్తులను 15 రోజుల్లో ధరణి వెబ్‌సైట్‌లో నమోదుచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. దసరా నుంచి ధరణి వెబ్‌పోర్టల్‌ ప్రారంభమవుతుందని చెప్పారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/