మరో పది అంబులెన్స్‌లను ప్రారంభించిన కెటిఆర్‌

Minister KTR
Minister KTR

హైదరాబాద్‌: ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కెటిఆర్‌ జన్మదినం సందర్భంగా ‘గిఫ్ట్‌ ఏ స్మైల్’‌ పేరుతో ప్రభుత్వానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంబులెన్స్‌లను అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే మంత్రి కెటిఆర్‌ ప్రగతి భవన్‌ వద్ద శనివారం మరో పది అంబులెన్స్‌లను ప్రారంభించారు. సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఓ అంబులెన్స్‌ను సమకూర్చారు. ఎంపీ రంజిత్‌రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి రెండు అంబులెన్స్‌లను ఇచ్చారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మహేశ్వర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అంబులెన్స్‌లను అందజేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/