తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల
TS-ICET-Results-released

హైదరాబాద్‌: తెలంగాణ ఐసెట్‌ – 2020 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి సోమవారం వరంగల్‌లో విడుదల చేశారు. కొవిడ్‌19 నేపథ్యంలో రెండు సార్లు పరీక్షలు వాయిదా వేశామని, అనేక సమస్యలతోనే మూడోసారి ఐసెట్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. మహమ్మారి సమయంలో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, వ్యయ ప్రయాసాలకోర్చి నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా విజయవంతంగా పరీక్షలు నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ, కామర్స్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌కు, ఐసెట్‌ బృందానికి ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి తరఫున అభినందనలు తెలిపారు. ఈ ఏడాది ఐసెట్‌లో ప్రవేశానికి 58,392 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. 45, 975 మంది పరీక్షకు హాజరైతే 41,506 మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. ఉత్తీర్ణత 90.28 శాతం నమోదైందని పేర్కొన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/