టీఎస్‌ ఐసెట్‌ దరఖాస్తు గడువు పెంపు

TS ICET
TS ICET

వరంగల్‌: టిఎస్‌ ఐసెట్‌-19 దరఖాస్తు గడువు ఈనెల 3వ తేదీతో ముగియనుంది. అయితే దరఖాస్తు గడువును ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 9వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు టీఎస్ ఐసెట్ కన్వీనర్ ఆచార్య సీహెచ్.రాజేశం తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రూ.500 అపరాథ రుసుముతో ఈనెల 12 వరకు, రూ.2000 అపరాధ రుసుముతో 14 వరకు, రూ.5000 అపరాధ రుసుముతో 16 వరకు, రూ.10 వేల అపరాధ రుసుముతో ఈనెల 18వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 14వ తేదీ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని, 23, 24వ తేదీల్లో పరీక్షలు ఉంటాయని అన్నారు. ప్రాథమిక కీ ఈనెల 29న ప్రకటించనున్నట్లు, అభ్యంతరాలు ఉంటే జూన్ 1వ తేదీ వరకు తెలియజేయవచ్చునని తెలిపారు.


మరిన్ని కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/