ఆన్‌లైన్‌ క్లాస్‌లపై హైకోర్టులో విచారణ

ఆన్‌లైన్‌ తరగతులపై యూనిఫామ్‌ పాలసీ తీసుకురావాలి..హైకోర్టు

Telangana High Court
Telangana High Court

హైదరాబాద్‌: ప్రైవేటు స్కూళ్ల ఫీజులు, ఆన్‌లైన్‌ క్లాసులపై హైకోర్టును ఆశ్రయించిన పేరెంట్స్ అసోసియేషన్ పిటీషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జీవో 46ను ఉల్లంఘించి ఫీజులు వసూలు చేస్తున్నారని పేరెంట్స్ అసోసియేషన్ కోర్టుకు తెలిపింది. వసూళ్ల కోసం స్కూళ్లు పంపించిన సందేశాలను, వాయిస్‌లను సాక్షాలుగా కోర్టుకు చూపించింది. దీంతో ఆన్‌లైన్‌ క్లాస్‌ల నిర్వాహణపై ప్రభుత్వం ఏమైనా సర్క్యూలర్‌ జారీ చేసిందా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నిచింది. ఆన్‌లైన్‌ క్లాస్‌లపై యూనిఫామ్‌ పాలసీ తీసుకు రావాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్‌ క్లాస్‌లపై ఎలాంటి నిర్ణయం తీసుకుందని హైకోర్టు ప్రశ్నించగా, జిల్లా విద్యాశాఖ అధికారులు దీనిపై పరిశీలిస్తున్నారని అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు అన్‌లైన్‌ క్లాస్‌లపై ఎలాంటి మార్గదర్శకాలు పాటిస్తున్నారే విషయం కోర్టుకు తెలియజేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఆన్‌లైన్‌ క్లాస్‌లు ఉంటాయా.. ఉండవా అన్న ప్రభుత్వ నిర్ణయం కోర్టుకు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/