సచివాలయం కూల్చివేత పనులు ఆపేయండి

వాతావరణం కాలుష్యమవుతోందని అభ్యంతరం

telangana high court
telangana high court

హైదరాబాద్‌: సచివాలయ భవనాల కూల్చివేత పనులు సోమవారం వరకు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కూల్చివేత పనులను నిలిపివేయాలంటూ ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు హైకోర్టులో పిల్ వేశారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కూల్చివేత పనులను కొనసాగిస్తున్నారని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. భవనాల కూల్చివేతతో వాతావరణం కాలుష్యమవుతోందని చెప్పారు. మున్సిపల్, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ నిబంధనలను పట్టించుకోవడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్ ను హైకోర్టు ఈరోజు విచారించింది. కూల్చివేత పనులను సోమవారం వరకు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో, సెక్రటేరియట్ కూల్చివేత పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టైంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/