సిఎల్పీ విలీనంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నోటీసులు

TS high court
TS high court

హైదరాబాద్‌: సిఎల్పీని టిఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయాలనే వ్యవహారంలో కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారించింది. గతంలో టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్‌ పక్షాన్ని టిఆర్‌ఎస్‌లో రాజ్యాంగ విరుద్ధంగా విలీనం చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. శాసనమండలి చైర్మన్‌కు ఏ అధికారం లేకపోయినా మండలిలో కాంగ్రెస పక్షాన్ని టిఆర్‌ఎస్‌లో విలీనం చేశారని షబ్బీర్‌ అలీ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన న్యాయస్థానం..శాసన మండలి ఛైర్మన్‌కు, ఎన్నికల సంఘంతో పాటు టిఆర్‌ఎస్‌లో విలీనమైన నలుగురు ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/