తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు ఆగ్రహం

మా ఆదేశాలు అమ‌లు చేయ‌డం లేదు .. హైకోర్టు

telangana high court
telangana high court

హైదరాబాద్: గ‌తంలో ఇచ్చిన ఆదేశాల‌ను ఏ ఒక్క‌టి అమ‌లు చేయ‌లేద‌ని  రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచార‌ణ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ తీరుపై హైకోర్టు మ‌రోసారి అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ప్రభుత్వం తరపున విచారణకు హాజరైన తెలంగాణ చీఫ్ సెక్రటరీపై హైకోర్టు సీరియస్ అయ్యింది. కరోనా చికిత్స అంశంలో ప్రైవేటు ఆస్పత్రులు ప్రజలను పీడిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే ఇప్పటివకు 50 మందికి నోటిసులు ఇచ్చామని ప్రభుత్వం కోర్టుకు వివరించింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రుల లైసెన్స్ రద్దు చేశామని న్యాయస్థానానికి తెలిపింది. అయితే మిగిలిన ఆస్పత్రుల పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం తాము ఇచ్చిన ఆదేశాలను పాటించడం లేదని గతంలో వ్యాఖ్యానించిన హైకోర్టు.. గతంలో ఇచ్చిన సూచనలు ప్రభుత్వం ఏ మేరకు పాటిస్తుందనే అంశంపై విచారణ చేపట్టింది. ఇందుకు సంబంధించి వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తరపున సీఎస్ సోమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేసు విచారణకు హాజరయ్యారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/