అసెంబ్లీ నిర్మాణంపై హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు

TS High Court
TS High Court

Hyderabad: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఎర్రమంజిల్‌లో భవనాలు కూల్చివేయొద్దంటూ దాఖలైన అన్ని వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ మేరకు ఇవాళ తీర్పును వెల్లడించింది. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మించాలని మంత్రివర్గం తీర్మానాన్ని కొట్టివేసింది. మంత్రివర్గ నిర్ణయం చట్టపరిధిలో లేదని హైకోర్టు పేర్కొంది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీని.. ఎర్రమంజిల్‌లోని భవనాలను కూల్చివేయొద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.