పెన్షన్ లో 50 శాతం కోత వ్యాజ్యాలపై తెలంగాణ హైకోర్టులో విచారణ

తదుపరి విచారణఈనెల 24కు వాయిదా

High Court of Talangana
High Court of Talangana

Hyderabad: రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లో 50 శాతం కోత ను సవాల్ చేస్తూ  దాఖలైన వ్యాజ్యాలపై  తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.

ఏ ప్రాతిపదికన పెన్షన్ లో కోత విధించారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశింంచింది.

విశ్రాంత ఉద్యోగుల ఫించనులో కోత విధించడం సమంజసం కాదని హైకోర్టు పేర్కొంది.

లాక్ డౌన్ సమయంలో పెన్షనర్లకు అనారోగ్య సమస్యలు వస్తే ఎవరు ఆదుకుంటారని ప్రశ్నించింది. పెన్షనర్ల విషయంలో ప్రభుత్వం దయ గా వ్యవహరించాలని కోర్టు పేర్కొంది. 

పూర్తి పెన్షన్ ఇచ్చేలా సర్కారును ఒప్పించాలని ఏజీకి సూచించిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/