కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ లేఖ
ఏపీ పరిమితికి మించి నీటిని తీసుకుంటోందని వెల్లడి
Krishna River Ownership Board in Jalasoudha
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ కు మరో లేఖ రాసింది. ఏపీ పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించకుండా ఆపాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. ఏపీ తన పరిమితికి మించి నీటిని తీసుకుంటోందని ఆరోపించారు. ఏపీ ఇప్పటికే 25 టీఎంసీలు తరలించిందని వెల్లడించారు. కేఆర్ఎంబీతో పాటు కేంద్ర జలశక్తి శాఖకు కూడా లేఖ ప్రతిని రాష్ట్ర ప్రభుత్వం పంపింది.
కాగా, నిన్న కూడా తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీ చైర్మన్ కు లేఖ రాసింది. ఈ నెల 9న నిర్వహిస్తున్న కేఆర్ఎంబీ సమావేశానికి తాము హాజరుకావడంలేదని, సమావేశం ఏర్పాటుకు మరో తేదీ నిర్ణయించాలని ఆ లేఖలో కోరింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/