కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి ఇంటి స్థలం అప్పగింత

గాల్వన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మరణించిన కర్నల్‌ సంతోష్‌ బాబు

land-was-handed-over-to-the-family-of-colonel-santoshbabu

హైదరాబాద్‌: అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిన విషయం తెలిసిందే. సంతోష్‌ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 5 కోట్ల ఎక్స్‌గ్రేషియాతో పాటు నివాస స్థలం, సంతోష్‌ భార్యకు గ్రూప్‌1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు సిఎం కెసిఆర్‌ ప్రకటించిన విషయం విదితమే.  అయితే ఈరోజు సంతోష్‌ భార్యకు నివాస స్థలం అప్పగించారు. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 14లో కేబీఆర్‌ పార్క్‌కు ఎదురుగా ఉన్న రూ. 20 కోట్ల విలువైన 711 గజాల స్థలాన్ని సంతోష్‌ బాబు కుటుంబానికి కేటాయించారు.

షేక్‌పేట మండలంలో మూడు స్థలాల్లో ఇష్టం వచ్చిన స్థలాన్ని కోరుకోవాలని సంతోష్‌ కుటుంబానికి ప్రభుత్వం సూచించింది. సంతోష్‌ కుటుంబ సభ్యుల కోరిక మేరకు బంజారాహిల్స్‌లోని 711 గజాల స్థలాన్ని కేటాయించారు. బుధవారం ఉదయం ఆ స్థలాన్ని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి పరిశీలించారు. ఆ తర్వాత స్థలానికి సంబంధించిన పత్రాలను సంతోష్‌ భార్యకు కలెక్టర్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/