‘సర్కారు వారి పాట’ కు తీపి కబురు తెలిపిన తెలంగాణ సర్కార్

Mahesh Babu in sarkaru vaari paata

పెద్ద సినిమాల రిలీజ్ టైములో అదనపు షోస్ తో పాటు టికెట్స్ ధరలు పెంచుకునే అవకాశం కలిపిస్తూ ఆయా చిత్ర నిర్మాతలకు , అభిమానులకు సంతోషం నింపుతున్న రెండు తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు, తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాటకు గుడ్ న్యూస్ అందించారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం మే 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ 5వ షోతో పాటు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది. మే 12 నుంచి 18 వ‌ర‌కు 5 షో కు.. వారం రోజుల పాటు మల్టీ ప్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలపై రూ.50 , ఎయిర్ కండిషన్డ్, ఎయిర్ కూల్డ్ థియేటర్లలో టికెట్ ధరపై రూ.30 పెంచుకునేందుకు అవకాశం ఇస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది. ఇక ఏపీలో సినిమాకు 10 రోజుల పాటు రూ.45 రూపాయ‌ల టికెట్ ధర‌ను పెంచుకోవచ్చు అని తెలిపింది. ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేశ్ హీరోయిన్ గా నటించగా, థమన్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే ఈ చిత్రంలోని సాంగ్స్ విపరీతంగా ఆకట్టుకొని సినిమా ఫై అంచనాలు పెంచేసాయి.