గాంధీ ఆస్ప‌త్రిలో ఎమ‌ర్జెన్సీ సేవలు, ఆప‌రేష‌న్లు నిలిపివేత..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి రోజు రోజుకు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి కి రాష్ట్ర సర్కార్ కీలక సూచనలు ఆదేశించింది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఈరోజు నుండి ఎమ‌ర్జెన్సీ కానీ ఆప‌రేష‌న్లను నిలిపివేయాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను సైతం విడుదల చేసింది.

దీంతో గాంధీ ఆస్పత్రిలో అత్యవసరం కానీ ఆపరేషన్లు జరగవు. రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గాంధీ ఆస్ప‌త్రిలో ఇక నుంచి క‌రోనా సోకిన వ్య‌క్తుల‌కు చికిత్స అందించ‌డానికి వినియోగించే అవ‌కాశం ఉంది. అలాగే గాంధీ ఆస్ప‌త్రిలో బెడ్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది. కాబ‌ట్టి క‌రోనా కేసులు పెరిగిన స‌మ‌యాల్లో అత్య‌వ‌స‌ర పరిస్థితుల్లో దీనిని ఉపయోగించు కోవ‌చ్చని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తుంది.

ఇక తెలంగాణ లో గ‌డిచిన 24 గంట‌ల‌లో 1,920 కేసులు న‌మోదు అయ్యాయ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్ర‌క‌టించారు. సోమ వారం రాష్ట్రం క‌రోనా కేసులు 1825 కేసులు న‌మోదు అయ్యాయి. నిన్న‌టితో పోలిస్తే.. ఈ రోజు 95 కరోనా కేసులు పెరిగాయి. ఈరోజు 417 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో ప్ర‌స్తుతం 16,496 యాక్టివ్ కేసులు ఉన్నాయి.