వినాయక నిమజ్జనం సందర్బంగా రేపు మూడు జిల్లాలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

వినాయక నిమజ్జనం సందర్బంగా రేపు హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వినాయక నిమజ్జనం సందర్భంగా మూడు జిల్లాలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది. శుక్రవారానికి బదులుగా ఈ నెల 12న రెండో శనివారాన్ని పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు.

గణేష్ నిమజ్జనం సందర్బంగా హైదరాబాద్ లో రెండు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. శుక్రవారం, శనివారం జరగనున్న గణేష్ శోభాయాత్రకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక వినాయక విగ్రహాల ఊరేగింపు జరిగే ప్రాంతాలు, నిమజ్జనం జరిగే ట్యాంక్ చుట్టుపక్కల రోడ్లను మూసివేస్తున్నారు. సెప్టెంబరు 9,10 రోజుల్లో హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో రహదారులు మూతపడనున్నాయి.