కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీరింగ్‌ అభినందనీయం

tamilisai soundararajan
tamilisai soundararajan

హైదరాబాద్‌: నగరంలోని హెచ్‌ఐసీసీలో 34వ భారతీయ ఇంజనీరింగ్‌ కాంగ్రెస్‌ సమావేశం ఇవాళ జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ..బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదల బతుకులు మార్చేందుకు సాంకేతికత ఉపయోగపడాలన్నారు. కృత్రిమ మేధతో ఇంజనీర్ల తమ ప్రతిభ, తమ పనితీరుకు పదునుపెట్టాలని సూచించారు. ఇంజనీరింగ్‌ కృషి మన దేశాభివృద్ధికి దోహదపడాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ఇంజనీరింగ్‌ విధానం అభినందనీయమని ఆమె ప్రశంసించారు. పర్యావరణాన్ని పాడు చేయకుండా అభివృద్ధి జరగాలని గవర్నరన్‌ తమిళిసై పిలుపునిచ్చారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/