పేద ముస్లింలకు రంజాన్‌ కానుకలు పంపిణీ

ramadan gifts
ramadan gifts

సిద్దిపేట: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సిద్దిపేటలో పేద ముస్లింలకు నేడు రంజాన్‌ కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో మూడు లక్షల పేద ముస్లింలకు సియం రంజాన్‌ కానుకలు పంపిణీ చేస్తున్నారన్నారు. ఈ నెల 31న ప్రభుత్వ ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పండగ రోజున అందరూ కొత్త దుస్తులు ధరించాలనేది సియం కేసిఆర్‌ ఆశయమన్నారు. త్వరలోనే పేదలకు రెండు పడకగదుల ఇళ్లు, పెంచిన పింఛన్లు అందించన్నుట్లు వెల్లడించారు. సిద్దిపేటను స్వచ్ఛ, హరిత పట్టణంగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని హరీశ్‌రావు ఈ సందర్భంగా పేర్కోన్నారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/