ఈ ఎస్ ఐ స్కాం లో ‘నాయిని’ అల్లుడికి ఈ డి సమన్లు

పలువురిని కస్టడీకి తీసుకునే అవకాశం

TS-ESI scam -ED issued notices
TS-ESI scam -ED issued notices

Hyderabad: తెలంగాణలో సంచలనం రేపిన ఈఎస్ ఐ స్కాం కు సంబంధించి ఎన్ఫోర్స్ మెంట్ తన విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులలో తీవ్ర అభి యో గాలు ఎదుర్కొంటున్న దివంగత మంత్రి నాయిని నరసింహారెడ్డి వద్ద గతంలో పిఏ గా పనిచేసిన రెవిన్యూ విభాగంలో జేసి హోదాలో ఉన్న ముకుంద్ రెడ్డి వినయ్ రెడ్డి (ముకుంద్ రెడ్డి బావ మరిది) ఈ ఎస్ ఐ మాజీ డైరెక్టర్ దేవిక రాణి లకు ఈ డి అధికారులు ఆదివారం సమన్లు జారీ చేశారు. ఈ స్కాం పై వివరాలు తెలిపేందుకు తమ ఎదుట 10 రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అంటే కాకుండా బుర్ర ప్రమోద్ రెడ్డి సహా మరికొందరికి కూడా సమన్లు జారీ అయ్యే వీలుందని తెలిసింది. ఈ స్కాములో సర్కారీ నిధులను కాజేసిన హవ్వలతో పాటు మనోయీయఁ లాండరింగ్ ద్వారా వేరే సంస్థలకు మల్లించినట్టు ఈ డి ఆధారాలను సేకరించింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/