రేపు టీఎస్ ఎడ్‌‌సెట్‌ పరీక్షలు

ts-edcet-tomorrow

హైదరాబాద్ః తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుండి ఎడ్‌సెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. తెలం‌గా‌ణలో 39, ఏపీ‌లోని కర్నూల్‌, విజ‌య‌వా‌డలో పరీక్షా కేంద్రా‌లను ఏర్పాటు చేశారు. మొత్తం 38,091 మంది విద్యా‌ర్థులు పరీక్ష రాయ‌ను‌న్నారు. రెండు గంటల పాటు నిర్వహించే ఈ పరీ‌క్షను ఒకే‌రోజు మూడు సెష‌న్లలో నిర్వహి‌స్తారు. ఉదయం 9 గంట‌లకు పరీక్ష ప్రారం‌భ‌మ‌వు‌తుం‌దని, నిమిషం ఆల‌స్యమైనా విద్యా‌ర్థు‌లను పరీ‌క్షా కేం‌ద్రా‌ల్లోకి అను‌మ‌తిం‌చ‌బో‌మని కన్వీ‌నర్‌ ప్రొఫె‌సర్‌ రామ‌కృష్ణ తెలి‌పారు. విద్యా‌ర్థులు తమ హాల్‌‌టి‌కె‌ట్లను https:// edcet.tsche.ac. in నుంచి డౌన్‌‌లోడ్‌ చేసు‌కో‌వా‌లని ఆయన కోరారు. ప్రతి‌ఒ‌క్కరూ కొవిడ్‌ నిబం‌ధ‌నలు పాటిం‌చా‌ల‌న్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/