నేడు ఈసెట్‌-2019 పరీక్ష

TS ECET - Exam
TS ECET – Exam

హైదరాబాద్‌: ఈరోజు ఈసెట్‌-2019 పరీక్ష జరగనుంది. రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్ కాలేజీల్లో ద్వితీయ సంవత్సరంలో (లాటరల్ ఎంట్రీ) ప్రవేశం కోసం ఈ పరీక్ష జరుగుతుంది.పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆన్‌లైన్ ద్వారా నిర్వహించనున్నారు. విద్యార్థులు రెండుగంటల ముందుగానే సెంటర్‌కు చేరుకోవాలని ఈసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం తెలంగాణ, ఏపీలో కలిపి మొత్తం 22 ప్రాంతీయ కేంద్రాలను, 85 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు ఆయన చెప్పారు. ఉదయం 8.30 గంటలకు విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లో రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం
https://ecet.tsche.ac.in అనే వెబ్‌సైట్‌లో లాగిన్ అయి తెలుసుకోవచ్చని సూచించారు.


మరిన్ని కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/