హైదరాబాద్ పర్యటనకు ప్రధాని..ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్, డీజీపీ

హైదరాబాద్ : ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు రానున్న నేపథ్యంలో నగరంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆఫీసర్లను ఆదేశించారు. సమతామూర్తి కేంద్రం, విగ్రహ పరిసరాలను సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి పరిశీలించారు. పీఎం టూర్‌ను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రధాని పాల్గొనే వేదికల వద్ద భద్రతా ఏర్పాట్లతోపాటు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తును బ్లూబుక్ ప్రకారం అమలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. వీవీఐపీ పర్యటన సమయంలో కరోనా ప్రొటోకాల్స్ పాటించేలా చూడాలని హెల్త్సెక్రటరీని సీఎస్ ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే..
వీవీఐపీ పాస్ హోల్డర్లకు షెడ్యూల్ చేసిన ప్రోగ్రామ్‌కు ముందే ఆర్టీ పీసీఆర్ కోవిడ్ టెస్టులు చేయాలన్నారు. పీఎం కాన్వాయ్ వెళ్లే మార్గంలో రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్‌బీ అధికారులను ఆదేశించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఇతర వేదికల వద్ద ఏర్పాట్లను పరిశీలించాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ప్రధాని పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా కూడా భద్రత విషయంలో చిన్న పొరపాటు కూడా ఉండకూడదని అధికారులను ఆదేశించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/