ప్రశాంతంగా కొనసాగిన కానిస్టేబుల్ రాత పరీక్ష

తెలంగాణ పోలీసు శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా కీలకమైన రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా కొనసాగింది. సివిల్, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించారు. అయితే సివిల్ ఇతర విభాగాల్లో 15644, ట్రాన్స్‌పోర్టు-63, ఎక్సైజ్‌లో 614 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నియామక బోర్డు గత ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ రాత పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరగనుంది. ఈ పరీక్షకు మొత్తం 6,61,196 మంది అభ్యర్థులు హాజరు కాగా అయితే పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు ముందే స్పష్టం చేసారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహించారు. ఈ కానిస్టేబుల్ పరీక్ష నిర్వహణ కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1601 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసారు.