కారు పంపిస్తా, రండి: ఆంధ్ర రైతుకు తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఆహ్వానం

సాగు అనుభవాలను తెలుసుకుంటానన్న ముఖ్యమంత్రి

Telangana CM KCR phone call to Andhra farmer
Telangana CM KCR phone call to Andhra farmer

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఘంటసాలపాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు ఉప్పల ప్రసాదరావుకు ఫోన్‌ చేసి, సాగు అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.

దాదాపు 4 దశాబ్దాలుగా వ్యవసాయం,పాడి పరిశ్రమ,వ్యవసాయ అనుబంధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రసాదరావు అనుభవాలను తెలంగాణలో ఆచరించేందుకు కెసిఆర్‌ ఆయన్ను స్వయంగా విందుకు ఆహ్వానించారు.

తనతో దాదాపు 10 నిమిషాలు ఫోన్‌లో సంభాషించిన సిఎం కెసిఆర్‌ వెద పద్దతిలో వరి సాగులో దిగుబడులు,ఖర్చు వివరాలు అడిగి తెలుసుకున్నారని,రెండు రోజుల్లో తనను కలిసేందుకు కారు పంపుతానని చెప్పారని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సాగు చేసే పద్దతులు వివరించారు. వ్యవసాయంతోపాటు 250 గేదెలు,అవులు,మేకలు,కోళ్ల పెంపకం చేస్తున్నానని దీని కారణంగా పొలానికి మంచి సేంద్రీయ ఎరువులు అంది..

భూమి ఆరోగ్యం మెరుగై దిగుబడులు పెరుగుతున్నాయని వివరించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు స్వయంగా ఫోన్‌ చేసి సాగు అనుభవాలు తెలుసుకోవటం,విందుకు ఆహ్వానించటం గర్వంగా ఉందని తెలిపారు.

వెద సాగుతో ఖర్చులు తగ్గటమే కాక దిగుబడి పెరుగుతున్నందున విషయం రైతులు గుర్తించాలని ప్రసాదరావు సూచించారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/