దీపం వెలిగించిన తెలంగాణ సీఎం కేసీఆర్

ప్రగతి భవన్ లో దీపాల వెలుగులు

TS CM KCR Lighting lamp

Hyderabad: దేశంలో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ఐక్య పోరాటానికి సంఘీభావ సంకేతంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం రాత్రి ప్రగతి భవన్ లో జ్యోతి వెలిగించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇచ్చిన పిలుపుమేరకు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కొవ్వొత్తి వెలిగించారు.

కొవ్వత్తి పట్టుకుని కరోనాపై పోరాడుతున్న వారికి సంఘీభావం ప్రకటించారు.

ముఖ్యమంత్రితో పాటు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, అడ్వకేట్ జనరల్ పి.ఎస్. ప్రసాద్ , అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/