ఘనంగా లష్కర్‌ బోనాలు

TS CM KCR
TS CM KCR

ఘనంగా లష్కర్‌ బోనాలు

హైదరాబాద్‌: లష్కర్‌లో ప్రారంభమైన సికింద్రాబాద్‌ శ్రీఉజ్జయినీ మహంకాళీ ఆషాడ బోనాల జాతర సందర్భంగా శ్రీ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారిని దర్శించుకు నేందుకు ఆదివారం ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిల్చి అమ్మవారిని దర్శించుకున్నారు. నగరంలోని అన్ని మార్గాల నుంచి అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులతో మహంకాళీ ఆలయం పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి. ఉదయం నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరడంతో ఆలయం పరిసర ప్రాంతాలలోని రోడ్లు కిటకిటలాడాయి.

ఆషాడ బోనాలలో ఈ ఏడాది అత్యంత ప్రత్యేకం అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం, తెల్లవారు జామున నాలుగు గంటలకే మంత్రి తలసాని కుటుంబసభ్యులతో కలిసి వచ్చి అమ్మ వారికి బోనాలు సమర్పించారు. బంగారు బోనం దృష్ట్యా నగర పోలీసుల ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్త్‌ చేపట్టారు. ఈ సందర్భంగా ఆదయ్యనగర్‌ కమాన్‌ నుంచి నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత బంగారు బోనంతో ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా వివిధ రకాలైన నృత్యాలు, ప్రత్యేక రంగులు కలిగిన చీరెలు ధరించిన మహిళలు నెత్తిన బోనాలు పెట్టుకుని ఆలయానికి తరలి వచ్చారు. గుస్పాడి, గోండు నృత్యాలు, డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలు ఎంత గానో అలరించాయి.