రజకులకు 5 కోట్లు

TS CM KCR
TS CM KCR

రజకులకు 5 కోట్లు

ఎకరం స్థలంలో హాస్టల్‌, కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం
చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు..
ఎరుకల కోసం భవనం ఏర్పాటు
రజక, ఎరుకల సంఘం ప్రతినిధులతో సిఎం కెసిఆర్‌ భేటీ

హైదరాబాద్‌: ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధి రంగాల్లో రజకులు ప్రగతి సాధించేందుకు ప్రభుత్వం అవసరమైన తోడ్పాటు అందిస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రజకులకు ఆర్థిక చేయూత అం దించే కార్యక్రమాలు అమలు చేయడం కోసం బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటా యించామని, ఇంకా అవసరమైన పక్షంలో మరిన్నీ నిధులు ఇవ్వడానికి కూడా సిద్దంగా ఉన్నామని సిఎం చెప్పారు. ఆ నిధులతో రజకుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో రజక సంఘం ప్రతినిధులే నిర్ణ యం తీసుకోవాలని చెప్పారు.