తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

రేపు ప్రగతి భవన్ లో కెసిఆర్ మరియు జగన్ సమావేశము

హైదరాబాద్ : గోదావరి జలాల తరలింపు విషయాలతో పాటుగా విభజనాంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు మాట్లాడనున్నారు . సోమవారం ప్రగతి భవన్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సమావేశమవనున్నారు. ప్రధానంగా గోదావరి జలాలను శ్రీశైలానికి తరలింపు విషయమై చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల మంత్రులు ఉన్నతాధికారులు ఇంజినీర్లు హాజరవుతారు.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి https://www.vaartha.com/telengana/