టీఎస్ సీజే సంచలన నిర్ణయం

అపరిష్కృత కేసులను పరిష్కరించడమే ధ్యేయం

1.87 లక్షల అపరిష్కృత క్రిమినల్ కేసుల పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ చీఫ్ జస్టిస్ శ్రీ రాఘవేంద్ర సింగ్ చౌహన్ గారు 2 ప్రత్యేక బెంచ్ లను ఏర్పాటు చేసారు ఈ బెంచ్ లు ప్రత్యేకంగా క్రిమినల్ కేసుల విచారణ మరియు పరిష్కారాలకు మాత్రమే అన్నారు . ఈ ప్రత్యేక బెంచ్ లు కేవలం శనివారాలు మాత్రమే పనిచేస్తాయన్నారు. మొదటి, మూడవ శనివారాలలో శ్రీ చౌహన్ గారు మిగతా రెండవ, నాల్గవ శనివారాలలో జస్టిస్ శ్రీదేవి గారి సమక్షంలో కేసుల విచారణ జరుగును .

తెలంగాణ హై కోర్ట్ లో జడ్జిల పరిమాణం తక్కువగా ఉందని 24 కు గాను 14 మంది జడ్జిలు మాత్రమే ఉన్నారని ఇంకా పరిమాణం 42 కు పెంచుట కొరకు ఇదివరకే ఢిల్లీ ఉన్నతాధికారులకు అర్జీ పెట్టినట్టు తెలిపారు. ఈ శనివారాలలో పని చెయ్యటం అనేది ఒక సంచలనమే అంటున్నారు నిపుణులు.

మరిన్ని వార్తల కోసం https://www.vaartha.com/telengana/