తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ప్రారంభం

K. Chandrashekar Rao
K. Chandrashekar Rao

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఆర్టీసికి సంబందించి పలు కీలక నిర్ణయాలను తీసుకోనుంది. ఆర్టీసిని విభజించే అంశంపై కీలక చర్చలు చేస్తారని సమాచారం. కాగా ఈ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధ్యక్షతన ప్రారంభమైంది. ప్రయాణికుల అవసరాల దృష్ట్యా ప్రైవేటు బస్సులు నడపడం, కార్పోరేషన్లుగా విభజించడం వంటి అంశాలపై చర్చించనున్నారు. దీంతో పాటు తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ ఏర్పాటు, స్కూలు అసిస్టెంట్‌ పదోన్నతులు, కోర్టులకు సిబ్బంది నియామకం, మౌలిక వసతులు పెట్టుబడుల విభాగం రోడ్లు భవనాల శాఖకు బదిలి చేయడం, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్ల నవీనీకరణ, పోలీస్‌ శాఖలో డిఎస్పి, కమాండెంట్ల పోస్టుల సృష్టి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ మంజూరు, ఖైదీల శిక్షా కాలం కుదింపు వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/