ప్రయత్నించి చూడు..

Try and See

కొందరు అనుకున్న వెంటనే ఆ పని పూర్తి చేస్తే ఆని నిద్రపోరు. మరికొందరు అనుకుంటారు కానీ రేపు ఎల్లుండి అనుకుంటూ వాయిదా వేస్తారు. ఇంకొరదరు అయితే అసలు చేయాలనే అనుకోరు. అది వేరేవిషయం. సాధారణ వ్యక్తులు అసాధారణ విజయాలను సాధించి చూపటానికి స్ఫూర్తినిచ్చింది ‘ఇంకొద్దిగా, ఇంకొంచెం ఎక్కువగా. అవ్ఞను. అపజయం పాలైనప్పుడు నిరాశ చెందకుండా, పట్టు సడలుతూ ఉన్నప్పుడు పట్టుదలను సడలనివ్వకుండా, మరొక్కసారి ఇంకొంచెం ఎక్కువగా, మళ్లీ మరొక్క సారి – ఇలా పట్టువదలని గుణమే వారి విజయసూత్రం.

ఇదెంత తేలికైనదంటే – ఎవరైనా అమలు పరచవచ్చు. మనలో చాలామందిలో బలంగా నాటుకున్న బలహీనత ఏమిటంటే – వాయిదా వేయటం. గడువ్ఞలు పెట్టడం. ‘ఇప్పుడు కాదు – కాసేపు అయ్యాకాలేక ‘మరోరోజు చేద్దాంలే. వాయిదా వేయటానికి కారణం ఉత్సాహ లోపం కాదు.

చక్కగా సాధించాలనే ఆలోచనతో, బాగా చేయాలనే తపనతో, చక్కగా సమగ్రంగా ప్రణాళిక తయారు చేసుకుందామని, పకడ్బందీగా సాధన చేసి చక్కగా ప్రారంభిద్దామని అనుకోవడం వల్ల ఆయిదా వేస్తూ ఉండవచ్చు. తక్షణమే ప్రారంభించడం, చాలా సందర్భాలలో మేలు చేస్తుంది. కొద్దికొద్దిగా ప్రారంభించిన కృషి అచిరకాలంలోనే చెప్పుకోతగ్గ స్థాయిని చేరుకుంటుంది.

అసలు ప్రారంభించడం జరిగితే (వాయిదా వేసే మనస్తత్వం నుండి బయటపడి తొలి అడుగు వేసినపుడు) తరువాత తరువాత ఎక్కువ చేయడం సాద్యపడుతుంది. మనం సాధించాల నుకున్న మంచి పనిని తక్షణమే మొదలుపెట్ట గలగడం ముఖ్యం. ప్రతిరోజూ క్రమం తప్ప కుండా కొంచెంగానైనా, పట్టు వదలకుండా వెంటనే ప్రారం భించి కొద్దిగానైనా ముందడుగు వేయడానికి మధ్య ఉన్న వ్యత్యాసం సుస్పష్టం. మనం స్వీయ క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి కానీ, క్రమశిక్షణా రాహిత్యాన్ని కాదు. మనం సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అసమర్థతను కాదు. మనం క్రమంగా ఉన్నతంగా ఎదగాలంటే మనం అనుకున్న మంచిపని ఎంటనే మొద లుపెట్టాలి అనే దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండాలి.

దెంత తేలికైనదంటే – ఎవరైనా అమలు పరచవచ్చు. మనలో చాలామందిలో బలంగా నాటుకున్న బలహీనత ఏమిటంటే – వాయిదా వేయటం. గడువ్ఞలు పెట్టడం. ‘ఇప్పుడు కాదు – కాసేపు అయ్యాకాలేక ‘మరోరోజు చేద్దాంలే. వాయిదా వేయటానికి కారణం ఉత్సాహ లోపం కాదు.

చక్కగా సాధించాలనే ఆలోచనతో, బాగా చేయాలనే తపనతో, చక్కగా సమగ్రంగా ప్రణాళిక తయారు చేసుకుందామని, పకడ్బందీగా సాధన చేసి చక్కగా ప్రారంభిద్దామని అనుకోవడం వల్ల ఆయిదా వేస్తూ ఉండవచ్చు. తక్షణమే ప్రారంభించడం, చాలా సందర్భాలలో మేలు చేస్తుంది. కొద్దికొద్దిగా ప్రారంభించిన కృషి అచిరకాలంలోనే చెప్పుకోతగ్గ స్థాయిని చేరుకుంటుంది.

అసలు ప్రారంభించడం జరిగితే (వాయిదా వేసే మనస్తత్వం నుండి బయటపడి తొలి అడుగు వేసినపుడు) తరువాత తరువాత ఎక్కువ చేయడం సాద్యపడుతుంది. మనం సాధించాల నుకున్న మంచి పనిని తక్షణమే మొదలుపెట్ట గలగడం ముఖ్యం. ప్రతిరోజూ క్రమం తప్ప కుండా కొంచెంగానైనా, పట్టు వదలకుండా వెంటనే ప్రారం భించి కొద్దిగానైనా ముందడుగు వేయడానికి మధ్య ఉన్న వ్యత్యాసం సుస్పష్టం. మనం స్వీయ క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి కానీ, క్రమశిక్షణా రాహిత్యాన్ని కాదు. మనం సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అసమర్థతను కాదు. మనం క్రమంగా ఉన్నతంగా ఎదగాలంటే మనం అనుకున్న మంచిపని ఎంటనే మొద లుపెట్టాలి అనే దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండాలి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/