సంకీర్ణ ప్రభుత్వం బల పరీక్ష వాయిదా?

CM Kumaraswamy
CM Kumaraswamy

బెంగళూరు: కర్ణాటక రాజకీయ పరిస్థితులు గంట గంటకు మారుతున్నాయి. సిఎం కుమారస్వామి బల పరీక్ష వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు బలపరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్‌ కోరుతోంది. మరోవైపు ఏదేమైనా బల పరీక్ష ఈ రోజే జరగాలని భాజపా నేత యడ్యూరప్ప పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌ కూడా ఈ రోజు ఈ అంశంపై చర్చించనున్నారు. అసమ్మతి ఎమ్మెల్యేల అదృశ్యం, ఎమ్మెల్యేల పిటిషన్‌పై విచారణ తదితర అంశాల నేపథ్యంలో బలపరీక్ష వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 22న లేదా 24కి వాయిదా వేసే అవకాశాలున్నాయి. అయితే ఇదే జరిగితే సంకీర్ణ ప్రభుత్వానికి భారీ ఊరట కలగనుంది.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/