అయ్యప్ప స్వామిని దర్శించకుండానే వెనుతిరిగిన తృప్తి దేశాయ్

Trupti Desai
Trupti Desai

కేరళ: మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ శబరిమలకు, వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకున్న తర్వాతానే కేరళను వదిలి వెళతానని చెప్పిన తృప్తి దేశాయ్ ఎట్టకేలకు తన పట్టుదలను వీడి తిరుగు ప్రయాణమయ్యారు. నిన్న ఉదయం కేరళకు చేరుకున్న ఆమె భద్రత కోసం ఎర్నాకుళం సిటి పోలీస్‌ కమిషనర్‌ కార్యలయానికి వెళ్లారు. అయితే ఆమెకు భద్రత కల్పించలేమని అధికారులు చెప్పడంతో పుణెకు తిరిగి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. తృపి దేశాయ్ రాకను తెలుసుకున్న శబరిమల కర్మ సమితి సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా తృప్తి దేశాయ్ మీడియాతో మాట్లాడుతూ..శబరిమల దేవాలయంలోకి మహిళళ ప్రవేశంపై న్యాయస్థానం స్టే ఇవ్వలేదు. అందువల్లే అయ్యప్ప స్వామి గుడికి వెళ్లేందుకు ఇక్కడ వచ్చామని, కానీ వచ్చినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, రక్షణ కల్పించమని కమిషనర్‌ కార్యలయాన్ని సంప్రదించాము. కానీ కేసు విచారణలో ఉన్నందున భద్రత కల్పించలేమని పోలీసులు తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన తాను భవిష్యత్తులో కూడా శబరిమలకు వస్తూనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/