కరోనా వ్యాక్సిన్ పై ట్రంప్ మాటల్ని విశ్వసించలేం
కమలా హారిస్

కరోనా వైరస్ టీకా విషయంలో డొనాల్డ్ ట్రంప్ మాటల్ని విశ్వసించడానికి లేదని అమెరికా ఉపాధ్యక్ష బరిలో ఉన్న కమలా హారిస్ పేర్కొన్నారు.
ట్రంప్ చెబుతున్నట్టుగా ఎన్నికల నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా దాని సామర్థ్యం, భద్రతపై తనకు నమ్మకం లేదన్నారు.
ఎన్నికల్లో లబ్ధిపొందడం కోసమే వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేయాలని ట్రంప్ ఆయా సంస్థలపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపణలున్న నేపథ్యంలో కమలా హారిస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/