ఉద్యమకారులకు మద్దతుగా బిల్లుపై ట్రంప్ సంతకం

వాషింగ్టన్: హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య కోసం పోరాడుతున్న ఉద్యమకారులకు మద్దతుగా రూపొందిన ఒక బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దీనిపై చైనా తీవ్రంగా మండిపడింది. దీనికి ప్రతిగా గట్టి చర్యలు ఉంటాయని హెచ్చరించింది. హాంకాంగ్‌కు ప్రస్తుతం ప్రత్యేక అమెరికా వాణిజ్య పరిశీలన హోదా ఉంది. ఇది ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతోంది. ఈ హోదాను కాపాడుకోవాలంటే హాంకాంగ్‌కు సరిపడిన స్థాయిలో స్వయంప్రతిపత్తి ఉందని అమెరికా విదేశాంగ శాఖ ఏటా ధ్రువీకరించాల్సి ఉంటుందని తాజా చట్టం సృష్టం చేస్తోంది. హాంకాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు కారకులైన చైనా, హాంకాంగ్ అధికారులపై ఆంక్షలకూ ఇది వీలు కల్పిస్తుంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/