ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారుకు కరోనా

ట్రంప్ కు ఎలాంటి ముప్పు లేదన్న వైట్ హౌస్

us-national-security-adviser-tested-corona-positive

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియన్ కు కరోనా సోకింది. వైద్య పరీక్షల్లో ఓబ్రియన్ కు పాజిటివ్ అని తేలింది. దీనిపై వైట్ హౌస్ ప్రకటన చేసింది. ఓబ్రియన్ కు కరోనా నిర్ధారణ అయిందని, ఆయన ప్రస్తుతం ఐసోలేషన్ లోకి వెళ్లారని తెలిపింది. క్వారంటైన్ లో ఉంటూ విధులు నిర్వర్తిస్తారని వెల్లడించింది. జాతీయ భద్రతా మండలి కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం ఉండదని స్పష్టం చేశాయి.

అమెరికా పాలన వ్యవహారాల్లోనూ, విదేశాంగ విధానంలోనూ కీలక పాత్ర పోషించే రాబర్ట్ ఓబ్రియన్ ఈ నెలలో పారిస్ వెళ్లి ఓ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఆయనకు ఎక్కడ కరోనా సోకిందన్న దానిపై స్పష్టతలేదు. జాతీయ భద్రతా సలహదారుకు కరోనా నిర్ధారణ అయిన నేపథ్యంలో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కు కరోనా ముప్పు లేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/