భారతీయ నిపుణలకు ట్రంప్‌ కీలక నిర్ణయాలు

Donald Trump
Donald Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికాకు వెళ్లే భారతీయ నిపుణులకు మేలు చేసే కీలక నిర్ణయాలతో నూతన వలస విధానాన్ని ట్రంప్‌ ప్రకటించారు. అమెరికా వీసా విధానంలో సంస్కరణలను ప్రతిపాదించిన ట్రంప్‌.. అత్యున్నత ప్రతిభ ఉన్న వలస ఉద్యోగుల కోటాను 12 శాతం నుంచి 57 శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించారు. అవసరమైతే ఈ సంఖ్యను మరింత పెంచుతామన్నారు. నైపుణ్యం, ప్రతిభ ఆధారణంగా అమెరికా వచ్చే వారికి తలుపులు తెరిచామని ట్రంప్‌ అన్నారు. అమెరికాకు వచ్చే వారికి ఆంగ్లం మాట్లాడటం తప్పనిసరి అని, అలాగే అమెరికా చరిత్ర, సంస్కృతి తదితర అంశాలపై నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు గ్రీన్‌కార్డులను మెరిట్‌ ప్రాతిపదికన జారీ చేయాలని, ప్రస్తుతం ఉన్న గ్రీన్‌కార్డు కేటగిరిల స్థానంలో కొత్తగా బిల్డ్‌ అమెరికా వీసాగను తీసుకురానున్నట్లు ట్రంప్‌ వెల్లడించారు.


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/