బంకర్‌లోకి వెళ్లిపోయిన ట్రంప్‌

నల్లజాతి యువకుడి హత్యపై నిరసన

donald trump
donald trump

వాషింగ్టన్‌: అమెరికాలో నల్లజాతి వ్యక్తిని పోలీసులు దారుణంగా హింసించి, అతని మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తూ, లక్షలాది మంది నిరసనలకు దిగుతూ.. పలు ‘వైట్‌ హౌస్‌’ ముందు చేరుకొని బీభత్సం చేశారు. వైట్ హౌస్ పక్కనే ఉన్న పార్క్ నకు చేరుకున్న నిరసనకారులు రెచ్చిపోతున్న వేళ, పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. నిరసనకారులను తరిమివేసేందుకు పెప్పర్ స్ప్రేలను సైతం వినియోగించారు. భారీగా నిప్పులను వెదజల్లే గ్రనేడ్లను కూడా ప్రయోగించారు. ఈనేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు జాగ్రత్త చర్యగా వైట్ హౌస్ కింద పాతాళంలో నిర్మించిన బంకర్ లోకి వెళ్లిపోయారని సమాచారం. శ్వేత సౌధం అధికారులు ఆయన్ను బంకర్ లోకి తరలించారని, దాదాపు గంట పాటు ఆయన అక్కడే ఉన్నారని, సీక్రెట్ సర్వీస్, యూఎస్ పార్క్ పోలీసు అధికారులు నిరసనకారులను నిలువరించిన తరువాత ట్రంప్ మరలా బయటకు వచ్చారని ఓ ఉన్నతాధికారి వివరించారు. అయితే ట్రంప్ తో పాటు ఆయన కుటుంబీకులైన మెలానియా, బారన్ తదితరులను కూడా బంకర్ లోకి తరలించారా? అన్న విషయంపై స్పష్టత లేదు. కాగా వాషింగ్టన్, లాస్ ఏంజిల్స్, హూస్టన్ తదితర నగరాల్లో నైట్ కర్ఫ్యూను విధించిన ప్రభుత్వం, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తోంది.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/