సైనిక ఖర్చును ఇచ్చేస్తే వెళ్లిపోతాం

తమ భూభాగం నుంచి వెనక్కి వెళ్లాలంటూ ఇరాక్ పార్లమెంటు తీర్మానం

Donald Trump
Donald Trump

అమెరికా: గత శుక్రవారం ఇరాక్ విమానాశ్రయంపై రాకెట్ దాడి చేసిన అమెరికా.. ఇరాన్ సైనిక ఉన్నతాధికారి ఖాసిం సులేమానీని హతమార్చింది. తమ భూభాగంపై సులేమానీని అమెరికా హతమార్చడంపై ఇరాక్ మండిపడుతోంది. ఈ నేపథ్యంలో తమ భూభాగం నుంచి అమెరికా బలగాలు వెంటనే వెనక్కి వెళ్లాలంటూ ఇరాక్ పార్లమెంటు తీర్మానం చేసింది. ఇరాక్ తీర్మానంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. వెళ్తాం కానీ .. ఇరాక్‌పై పెట్టిన సైనిక ఖర్చును ఇచ్చేస్తే అలాగే వెళ్లిపోతామని పేర్కొన్నారు. ఇరాక్‌లో వైమానిక స్థావరాన్ని నిర్మించేందుకు వందల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని, ఆ డబ్బు మొత్తం ఇచ్చేస్తే వైదొలుగుతామని, లేదంటే లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, అదే జరిగితే తాము విధించే ఆంక్షలకు విలవిల్లాడడం ఖాయమని హెచ్చరిక జారీ చేశారు.

తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/