దారిలో ఉన్నాం.. హిందీలో ట్రంప్ ట్వీట్
భారతదేశంలో అడుగుపెట్టాలని ఎదురు చూస్తున్నాం

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాసేపట్లో భారత్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ‘వచ్చేస్తున్నా’ అంటూ హిందిలో ట్వీట్ చేసి అబ్బురపర్చారు. తాము భారతదేశంలో అడుగుపెట్టాలని ఎదురు చూస్తున్నామని, దారిలో ఉన్నామని, కొన్ని గంటల్లో అందరినీ కలుస్తామని ఆయన చెప్పారు. ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంక ట్రంప్, అల్లుడు జారెడ్ కుష్నర్ కూడా ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలలోపు అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి వారికి ఘన స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత్‌కు వస్తుండడం పట్ల ట్రంప్ ఎనలేని ఉత్సాహం కనబర్చుతున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/