ట్రంప్‌ గోల్ఫ్‌ రిసార్టులో జి7 సదస్సు

అధికార దుర్వినియోగమని విమర్శలు

trump
trump

వాషింగ్టన్‌: జి7 దేశాల సదస్సును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన ఫ్లోరిడాలోని గోల్ఫ్‌ రిసార్టులో నిర్వహించాలని నిర్ణయించారు. కాగా ట్రంప్‌ అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట అంటూ ప్రతిపక్ష డెమోక్రాట్లు మండిపడుతున్నారు. జి7 దేశాల సదస్సు ట్రంప్‌ నేషనల్‌ డోరల్‌ గోల్ఫ్‌ రిసార్టులో జరుగుతుందని వైట్‌హౌస్‌లో చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మిక్‌ ముల్వానే చెప్పారు. వచ్చే ఏడాది జూన్‌ 10 నుంచి 12 తేదీలలో ఈ సదస్సు జరుగుతుందని ముల్వానే అన్నారు. సుమారు డజనుకు పైగా ప్రదేశాలను పరిశీలించిన పిమ్మట గోల్ఫ్‌ రికార్డును ఎంపిక చేసినట్లు ముల్వానీ చెప్పారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/