బ్రెజిల్‌, అర్జెంటీనా దేశాల దిగుమతులపై భారీ సుంకాలు పెంపు

Trump
Trump

అమెరికా:బ్రెజిల్‌, అర్జెంటీనా దేశాల దిగుమతులపై భారీ సుంకాలు విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. స్టీలు, అల్యూమినియం టారీఫ్‌లు భారీగా పెంచనున్నట్టు తెలిపారు. బ్రెజిల్‌, అర్జెంటీనా దేశాల ఉక్కు, అల్యూమినియం కర్మాగారాలను లక్ష్యంగా చేసుకొని ట్రంప్‌ తాజా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. సుంకాల పెంపునకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని వైట్‌హౌస్‌ పేర్కొంది. అదే విధంగా, ఫ్రాన్స్‌ ఉత్పత్తులపై 2 బిలియన్‌ డాలర్ల లెవీ విధించాలని ట్రంప్‌ యోచిస్తున్నారని తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/