ఇరాన్‌తో యుద్దం ఆలోచన లేదు

Trump
Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌తో యుద్దం ఆలోచన లేదని పేర్కొన్నారు. అయితే జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌, విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియోలు యుద్ధభేరీలు మోగించేందుకు సన్నద్ధమవుతున్నారన్న ఆందోళనల సందర్భంగా ట్రంప్‌ ఈవ్యాఖ్యలు చేశారు. బోల్టన్‌, పాంపియోలు తనను యుద్ధం వైపునకు నెట్టేస్తున్నారన్న ఆరోపణలను ట్రంప్‌ ఖండించారు. ఇరాన్‌ దురుసుగా ప్రవర్తిస్తోందన్న వాదనపై మరింత సమాచారం ఇవ్వాలని అమెరికా చట్టసభ సభ్యులు వైట్‌హౌస్‌ను డిమాండ్‌ చేశాయి. దీంతో అమెరికా కాంగ్రెస్‌లోని అగ్రశ్రేణి సభ్యులకు ప్రభుత్వం రహస్య వివరణ ఇచ్చింది.


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/