అమెరికాలో విదేశీయుల స్థిర నివాసానికి ట్రంప్ బ్రేక్
ఇమ్మిగ్రేషన్ రద్దుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అమెరికాలో విదేశీ వలసకు అడ్డుకట్ట వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజగా ట్రంప్ ఇమిగ్రేషన్‌కు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతక చేశారు. దీంతో విదేశీయులు అమెరికాలోకి ఎవరూ రాకుండా చేయడంతోపాటు.. అమెరికాలో స్థిరపడి గ్రీన్‌కార్డుపై ఆశలు పెట్టుకున్న వారికి ఈ నిర్ణయం శరాఘాతంగా మారుతోంది. ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల కోసం ఎన్నో లక్షల మంది ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు ప్రతియేటా వెళ్తూనే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీటికి సంబంధించిన వీసాల జారీని నిలిపివేశారు. అలాగే అమెరికాలోనే స్థిరపడిన కొన్ని లక్షల మంది విదేశీయులు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేశారు. వీరి ఆశలను కూడా అడియాశలు చేస్తూ.. గ్రీన్‌కార్డుల జారీని కూడా 60 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ సర్కారు తేల్చిచెప్పింది. 60 రోజుల కాలపరిమితి ముగిశాక.. దీనిని పొడిగించాలా.. లేక సవరణలు చేయాలా అన్నది విశ్లేషిస్తామని ఇప్పటికే ట్రంప్ తెలిపారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/