కరోనా వ్యాక్సిన్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన

ఈ ఏడాది చివరి కల్లా కరోనా వ్యాక్సిన్‌ను అమెరికా తీసుకొస్తుంది

Trump
Trump

వాషింగ్టన్‌: ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విలయతాండవ చేస్తుంది. దీంతో ప్రపంచ దేశాలు కరోనాకు వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్నాయి. అయితే ఈవిషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… ఈ ఏడాది చివరి కల్లా వ్యాక్సిన్ తీసుకొస్తామని చెప్పారు. అమెరికాలో పాఠశాలలు, విశ్వ విద్యాలయాలు సెప్టెంబరులో తిరిగి ప్రారంభించాలని తాను ఆయా విద్యా సంస్థలను కోరతానని ట్రంప్ చెప్పారు.

కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు వ్యాక్సిన్‌ను ముందుగా తయారు చేయడానికి పోటీ పడుతున్న విషయంపై ట్రంప్ స్పందిస్తూ… అమెరికా పరిశోధకుల కంటే ముందే ఏ దేశమైనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తే హ్యాట్సాఫ్ చేస్తానని వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్‌ను ఎవరు అభివృద్ధి చేశారన్న విషయాన్ని తాను పట్టించుకోనని, కరోనాకు వ్యాక్సిన్‌ రావడమే ముఖ్యంగా భావిస్తానని చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/