ఇది ప్రపంచంలోనే రికార్డన ట్రంప్

అన్ని దేశాల్లో జరిగిన నమూనాల పరీక్షల కన్నా అమెరికాలో అధిక టెస్టింగ్

trump
trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం నాడు వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఇండియా సహా మరో 9 దేశాల్లో ఇప్పటివరకూ జరిగిన కరోనా నిర్దారణ పరీక్షల కన్నా, ఒక్క అమెరికాలోనే అత్యధిక పరీక్షలను జరిపించామని, ఇది ప్రపంచంలోనే ఓ రికార్డని ట్రంప్ వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారిపై జరుగుతున్న యుద్ధంలో భాగంగా ఇంతవరకూ 41.8 లక్షల మంది ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించామని అన్నారు. ఇది ఓ రికార్డని తెలిపారు.

‘ఫ్రాన్స్, యూకే, సౌత్ కొరియా, జపాన్, సింగపూర్, ఇండియా, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, స్వీడన్, కెనడా దేశాల్లో ఇప్పటివరకూ చేసిన అన్ని పరీక్షల కన్నా, అమెరికాలో చేసిన పరీక్షల సంఖ్య అధికం’ అని ఆయన అన్నారు. కాగా, యూఎస్ లో సుమారు 8 లక్షల మందికి వైరస్ సోకగా, ఇప్పటివరకూ 40 వేల మందికి పైగా మరణాలు సంభవించాయి. కరోనా ప్రభావం అధికంగా ఉన్న న్యూయార్క్ నగరంలో 17,600 మంది మరణించగా, 2.42 లక్షల మందికి వ్యాధి సోకింది. కాగా ప్రస్తుతం అమెరికాలోని సుమారు 33 కోట్ల మంది ప్రజల్లో 95 శాతానికి పైగా లాక్ డౌన్ ను పాటిస్తూ, ఇంటికే పరిమితం అయ్యారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/