డబ్ల్యూహెచ్‌వో పై ట్రంప్‌ కీలక నిర్ణయం

డబ్ల్యూహెచ్‌వోతో అమెరికా తెగదెంపులు..చైనాపై ఆంక్షలు

trump

వాషింగ్టన్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)తో పూర్తిగా సంబంధాలను తెంచుకున్నట్లు అమెరికా అధ్యక్షుడ డొనాల్ట్‌ ట్రంప్‌ తెలిపారు. నిన్న అర్ధరాత్రి వైట్‌హౌస్‌లో మాట్లాడుతూ ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా వైరస్ విషయంలో అటు చైనా, ఇటు ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండూ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించాయని తొలి నుంచీ ఆరోపిస్తున్న ట్రంప్.. మరోమారు అవే వ్యాఖ్యలు చేశారు. వాటి నిర్లక్ష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అపార ప్రాణ, ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, వైరస్ విషయంలో కీలక అంశాలు దాచిపెట్టిందని ఆరోపిస్తూ చైనాపై ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపారు. అమెరికా చట్టాలను గౌరవించకుండా అమెరికా గడ్డపై ఉన్న చైనా కంపెనీలపైనా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. డబ్ల్యూహెచ్‌వోకు ఇప్పటి వరకు అందిస్తూ వచ్చిన నిధులను ప్రపంచంలోని ఇతర ఆరోగ్య సంస్థలకు మళ్లిస్తామని ట్రంప్ తేల్చిచెప్పారు. కాగా క‌రోనా వైర‌స్ ప‌ట్ల చైనా నుంచి స‌మాధానం కావాల‌ని ప్ర‌పంచ‌దేశాలు ఆశిస్తున్నాయ‌ని, ఈ విష‌యంలో పార‌ద‌ర్శ‌క‌త అవ‌స‌ర‌మ‌ని ట్రంప్ అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/