ట్రంప్‌ స‌ల‌హాదారుకి కరోనా..క్వారంటైన్‌లో ట్రంప్ దంప‌తులు

Trump says he will quarantine after top aide Hope Hicks tests positive for coronavirus

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖ్య సలహాదారు హోప్ హిక్స్ కు కరోనా సోకింది. ఆమె అస్వస్థతకు గురి కావడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చిందని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. దీంతో అధ్య‌క్షుడు ట్రంప్, ఆయ‌న స‌తీమ‌ణి మెలానియా ట్రంప్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. తాము కూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నామ‌ని, ఫ‌లితాల కోసం వేచిచూస్తున్నామ‌ని ట్రంప్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. అయితే తాను ఎన్నిరోజుల‌పాటు ఐసోలేష‌న్‌లో ఉంటాన‌నే విష‌యాన్ని తెలప‌లేదు.
కాగా ట్రంప్ ఎక్కడికి వెళుతున్నా, ఆయనతో పాటే హిక్స్ కూడా ప్రయాణిస్తుంటారు. ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కడికి బయలుదేరినా, అందులో హోప్ హిక్స్ కూడా ఉండటం తప్పనిసరి. ఇటీవల క్లేవ్ లాండ్ లో జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్ కార్యక్రమానికి ఆమె వెళ్లారు. హోప్ హిక్స్ కు కరోనా సోకడంపై వైట్ హౌస్ స్పందిస్తూ, ఖిఅధ్యక్షుడు ట్రంప్ తన ఆరోగ్యం, భద్రతతో పాటు తనకు మద్దతుగా నిలిచే వారందరి ఆరోగ్యం, అందరు అమెరికన్ల ఆరోగ్యంపై అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నారుఖి అని పేర్కొంది. కరోనా వ్యాపించకుండా, అన్ని రకాల జాగ్రత్తలనూ అమలు చేస్తున్నారని వెల్లడించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/