ఓ ముఖ్యమైన వ్యక్తికి క్షమాభిక్ష..ట్రంప్‌

Donald Trump
Donald Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ విలేకరుల సమావేశంలో‌ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ అతి ముఖ్య‌మైన వ్య‌క్తిని మంగళవారం క్ష‌మించ‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. అయితే ఆ జాబితాలో వికీలీక్స్ వ్య‌వ‌స్థాప‌కుడు ఎడ్వ‌ర్డ్ స్నోడెన్ కానీ, మాజీ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు మైఖేల్ ఫ్లిన్ కానీ లేర‌న్నారు. అయితే ఎవ‌ర్ని క్ష‌మిస్తున్నార‌న్న విష‌యాన్ని వెల్ల‌డించేందుకు మాత్రం ట్రంప్ నిరాక‌రించారు. అయితే స్నోడెన్‌ ఎన్‌ఎస్‌ఏకు చెందిన దేశీయ, అంతార్జతీయ నిఘా కార్యకలాపాలకు సంబంధించిన రహస్య ఫైళ్లను 2013లో వార్తాసంస్థలకు లీక్‌ చేశాడు. ప్రస్తుతం అతడు రష్యాలో ఆశ్రయం పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ట్రంప్‌ స్నోడెన్‌కు క్షమాభిక్షను పరిశీలిస్తున్నట్లు తెలిపారు ట్రంప్‌. గత నెలలో ట్రంప్‌ తన అధ్యక్ష అధికారాన్ని ఉపయోగించి తన చిరకాల మిత్రుడు, సలహాదారు రోజర్‌ స్టోన్‌ శిక్షను రద్దు చేశారు. అతడు 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తు చేస్తోన్న చట్టసభ సభ్యులు అతడిని దోషిగా తేల్చారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/